ఏం మాట్లాడుతారు : మోడీ ప్రచార షెడ్యూల్ 

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 01:26 AM IST
ఏం మాట్లాడుతారు : మోడీ ప్రచార షెడ్యూల్ 

Updated On : March 29, 2019 / 1:26 AM IST

బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ప్రచారానికి మరికొద్ది రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మార్చి 29వ తేదీ శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నేతలు పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారు. 

మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.40కి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. 
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.20కి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్‌ చేరుకుంటారు.
2.30కు బహిరంగ సభ ప్రారంభం. 

మహబూబ్‌నగర్‌ మోదీ పర్యటన ముందు బీజేపీకి మరింత జోష్‌ పెరిగింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఇంతకుముందు కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్న డీకె అరుణ బీజేపీ తరపున మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌లో నుంచి మోదీ కర్నూలుకు వెళుతారు. 

మధ్యాహ్నం 3.25కు బూత్పూర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 
4.10కి కర్నూలులోని నెహ్రూనగర్‌ హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 
రోడ్డు మార్గంలో ఎస్‌టీబీసీ కాలేజీ మైదానానికి వెళ్తారు. 
అక్కడ జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు.