మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులను దూషించి, విధులకు ఆటకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులను దూషించి, విధులకు ఆటకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులను దూషించి, విధులకు ఆటకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడుపై 353, 500, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే తన నివాసంపై వైసీపీ జెండా కట్టిన నేపథ్యంలో డిసెంబర్ 12న అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు చేసేందుకు, పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసుల విధులకు భంగం కలిగించిన అయ్యన్నపాత్రుడు, వారిని దూషించారన్నారు పోలీసులు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశామన్నారు.
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, సన్యాసి నాయుడు ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పై అంతస్తులో ఒకరు, కింది అంతస్తులో మరొకరు నివసిస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీలో చేరిన అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసి పాత్రుడు కుటుంబ సభ్యులు ఇంటిపై వైసీపీ జెండా కట్టేందుకు ప్రయత్నించారు. సన్యాసి పాత్రుడి కుమారుడు వరుణ్..వైసీపీ జెండా కడుతున్న సమయంలో అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యురాలైన లక్ష్మీ అడ్డుకుంది. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి, తోపులాటలో ఆమె కిందపడింది. దీంతో లక్ష్మీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీచేసిన ఓటమిపాలయ్యారు. వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ చేతిలో అయ్యన్నపాత్రుడు ఓడిపోయారు. ఆ ఓటమిని జీర్ణించుకునే లోపే ఆయన తమ్ముడు గట్టి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేశారు. ఇరువురు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.