డ్రైవర్ నిద్రమత్తు : ఆర్టీసీ బస్సు బోల్తా

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 12:33 AM IST
డ్రైవర్ నిద్రమత్తు : ఆర్టీసీ బస్సు బోల్తా

Updated On : January 18, 2019 / 12:33 AM IST

నెల్లూరు : సంగం మండలంలోని కోలగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 10 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణీకులున్నారు. నంద్యాల నుండి నెల్లూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.