నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 03:56 PM IST
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ

Updated On : November 28, 2019 / 3:56 PM IST

ఆంధ్రప్రదేశ్‌ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. సీఎం జగన్‌ చైర్మన్‌గా, మంత్రులు, అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు శామ్యూల్‌ను వైఎస్‌ చైర్మన్‌గా నియమించారు.

25 మందితో కూడిన ఈ కమిటీలో వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి కమిటీకి జిల్లా ఇన్ చార్జి మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సంబంధిత జిల్లా మంత్రులు, జిల్లాల్లోని వివిధ శాఖాధిపతులు సభ్యులుగా ఉంటారు. 
 

డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పుష్ప శ్రీవాణి, ఆళ్లనాని, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌, శ్రీరంగనాథరాజ్‌, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు.

12 శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర స్థాయిలో సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్‌ మంత్రుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. నవరత్నాలను సమర్థవంతగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలను అమలు చేస్తున్నారు.

నవరత్నాల అమలును ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేయనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పథకాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించనున్నారు.