60మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు : ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్
ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ

ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ
ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రుల పేర్లు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు విడుదల చేసింది టీడీపీ. స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన, బొత్స, రోజా, పెద్దిరెడ్డి అనుచరులు, కుటుంబసభ్యులకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని ఆరోపించారు. వారి పేర్లను చార్జిషీట్ లో ప్రస్తావించారు.
వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందన్నారు. 70 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఎన్నడూ రాని ఇసుక కొరత ఇప్పుడే ఎందుకొచ్చిందని ఆలపాటి రాజా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై ఎల్లుండి చంద్రబాబు దీక్ష చేయనున్నారని అచ్చెన్న తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం విధానాల వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు వాపోయారు.