అనంతలో టీడీపీ-వైసీపీ రాళ్లదాడి : టీడీపీ కార్యకర్త మృతి
అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ

అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ
అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కర్ రెడ్డి మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఓటర్లకు గుర్తింపు కార్డు లేకపోవడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాట మాట పెరిగి రాళ్ల దాడి చేసుకునే వరకు వెళ్లింది. టీడీపీ కార్యకర్త మృతితో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వీరాపురంలో పోలింగ్ నిలిపివేశారు. తాడిపత్రిలోని ఎల్లనూరు మండలం జంగాలపల్లిలో కూడా టీడీపీ-వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రాప్తాడు నియోజకవర్గం మరూరులోనూ టీడీపీ-వైసీపీ కార్యకర్తలు గొడపపడ్డారు. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. ధర్మవరం నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు.