మోడీ 15 లక్షలు ఏవీ : లంగ పంచాయతీలు పెట్టొద్దు – కేసీఆర్

  • Published By: madhu ,Published On : April 7, 2019 / 12:11 PM IST
మోడీ 15 లక్షలు ఏవీ : లంగ పంచాయతీలు పెట్టొద్దు – కేసీఆర్

Updated On : April 7, 2019 / 12:11 PM IST

బ్లాక్ మనీ తెస్తానని చెప్పి ఏం చేశారు ? ప్రతి ఇంటికి ఇస్తానన్న 15 లక్షలు ఎక్కడా ? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లంగ పంచాయతీలు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని..ఓట్లను దండుకోవడానికే ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు కేసీఆర్. ఎన్నికలు అనగానే హిందుత్వం..పాకిస్తాన్ అంటూ వాదనలు ముందుకు తెస్తారని గుర్తు చేశారు. 

ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం కేసీఆర్ నిర్మల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ, మోడీలపై విమర్శలు చేశారు. 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు..కోటి మందికైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రామాలయం..పాకిస్తాన్..హిందుత్వం గుర్తుకు వస్తుందా ? ప్రజల సమస్యలు లేవా ? అని నిలదీశారు కేసీఆర్. బీజేపీ చేస్తున్న ప్రచార హోరులో కొట్టుకపోవద్దని యువతకు సూచించారు. దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు..దేశం తెలివి తెచ్చుకుని పని చేస్తే తమ దేశానికి ఏమైనా ప్రమాదం ఉందా అని చైనా ఆలోచించి..ఓ కమిటీ వేసిందన్నారు. భారత దేశంలో ఇంకా కులం..మతం అంటూ కొట్టుకుంటున్నారని నివేదిక ఇచ్చారన్నారు. 

గిట్టుబాటు ధర కేంద్రం గుప్పిట్లో ఉందన్న కేసీఆర్..ఐదేళ్లలో 500 దరఖాస్తులు ఇచ్చామని..పుసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం స్పందించడం లేదన్నారు. సిగ్గులేని భావదారిద్రపు ఉన్న పార్టీ ఇదని విమర్శించారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలేనని..ప్రజల కోరిక..ప్రజల అభీష్టం గెలవాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల కళ్లెదుటే ఉన్నాయని..గతంలో ఎలా ఉందో..ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.