విషాదం : చిన్నారితో సహా భార్యాభర్తలు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరుకు సమీపంలోని సంతపేటలో చిన్నారితో సహా భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రవి(50) అనే వ్యక్తితో పాటు అతని భార్య భువనేశ్వరి(45), కూతురు గాయత్రి(9) కూల్ డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల సమస్యలతోనే వీరు ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
రవి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రవి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడిన వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు మతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతుల ఆత్మహత్యలకు కారణం కుటుంబ కలహాలా? లేక ఆర్థిక ఇబ్బందులా? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరి ఆత్మహత్యలతో ఇరు కుటుంబాల్లోను విషాదం నెలకొంది.