TTDలో మరో వివాదం : 40 మంది మజ్దూర్ల తొలగింపు!

TTD దేవస్థానం మరో వివాదంలో చిక్కుకుంది. పరకామణిలో పనిచేస్తున్న మజ్దూర్ల తొలగించారనే వార్త కలకలం రేపుతోంది. ఎలాంటి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయకుండానే 40 మంది మజ్దూర్లను ఎలా తొలగిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనివల్ల హుండీ లెక్కింపులో సమస్యలు ఏర్పడుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. మజ్దూర్ల తొలగింపు వెనుక టీటీడీ ఆర్థిక శాఖ అధికారి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. పరకామణిలో గత సెప్టెంబర్ నుంచి అప్రైజర్ లేకుండానే కొనసాగుతోందిన టాక్. గతంలో మాదిరే సిబ్బందిని కేటాయించాలని పరకామణి అధికారులు కోరుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఉన్నతాధికారులు ఏప్రిల్ 27వ తేదీ శనివారం భేటీ కానున్నారు.
Also Read : నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుపతికి రాష్ట్రాలు..దేశ..విదేశాల నుండి భక్తులు తరలివస్తుంటారు. వీరి కానుకలు అక్కడి హుండీలో సమర్పిస్తారు. నగదు, బంగారం, వెండీ, ఆభరణాలు..ఇలా ఎన్నో రూపాల్లో కానుకలు వేస్తుంటారు..ఇస్తుంటారు. వీటిని లెక్కించే విధానాన్ని పరకామణి అని పిలుస్తుంటారు. బంగారం..వెండిని మదింపు చేయడానికి అప్రైజర్ అవసరం ఉంటుంది. కానీ..సెప్టెంబర్ నుండి అప్రైజర్ లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా కొనసాగుతుండగానే ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూసుకోకుండానే పరకామణిలో పనిచేస్తున్న మజ్దూర్లను తొలగించినట్లు సమాచారం. దీంతో ఆదాయ లెక్కింపు పనులు నిలిచిపోయినట్లు..ప్రస్తుతం నోట్ల రూపంలో మాత్రమే లెక్కిస్తున్నారని..బంగారం, ఇతర వస్తువులు హుండీలో పేరుకపోతున్నాయని టాక్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక