ఎంతకష్టమీ అవ్వకు : టాయ్ లెట్ లోనే జీవనం
క్యాన్సర్ వ్యాధితో భర్త చనిపోయాడు..ఇల్లు లేదు..పిల్లలు లేరు..ఎలా వున్నావని అడిగే దిక్కులేదు. కడివెడు కన్నీళ్లతో పుట్టెడు కష్టాలతో మరుగుదొడ్డిలోనే బ్రతుకు వెళ్లదీస్తోందో అవ్వ. ఆ అవ్వ పేరు వెంగళ నాగరత్నం.. భర్త క్యాన్సర్ తో చనిపోయాడు. భర్త కట్టిన గుడిసె రెండేళ్ల క్రితమే కూలిపోయింది. నిలువనీడలేదు. దిక్కులేని ఆమెకు స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో కట్టిన మరుగుదొడ్డే నివాసమైంది.

టాయ్ లెట్టే ఆమె ఇల్లు..
క్యాన్సర్ తో భర్త మృతి
ఇల్లు లేదు..పిల్లలు లేరు
ఎలా వున్నామని అడిగే దిక్కులేదు
కడివెడు కన్నీళ్లు..పుట్టెడు కష్టాలు ఆమెకు తోడు
చలికి వణుకుతు..వానకు తడుస్తు..అవ్వ జీవనం
ఖమ్మం : క్యాన్సర్ వ్యాధితో భర్త చనిపోయాడు..ఇల్లు లేదు..పిల్లలు లేరు..ఎలా వున్నావని అడిగే దిక్కులేదు. కడివెడు కన్నీళ్లతో పుట్టెడు కష్టాలతో మరుగుదొడ్డిలోనే బ్రతుకు వెళ్లదీస్తోందో అవ్వ. ఆ అవ్వ పేరు వెంగళ నాగరత్నం.. భర్త క్యాన్సర్ తో చనిపోయాడు. భర్త కట్టిన గుడిసె రెండేళ్ల క్రితమే కూలిపోయింది. నిలువనీడలేదు. దిక్కులేని ఆమెకు స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో కట్టిన మరుగుదొడ్డే నివాసమైంది.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం..కలకోటకు చెందిన నాగరత్నం మరుగుదొడ్డినే జీవిస్తోంది. చలికి వణుకుతూ.. వానకు తడుస్తూ బతుకీడుస్తుంది. భారీ వర్షం మాత్రం పడ్డప్పుడు పక్కింట్లో తలదాచుకుంటుంది. అదీకూడా వారుదయతలిస్తేనే.
కూలీనాలీ చేసి.. సంపాదించిన డబ్బంతా భర్త జబ్బు నయం చేసేందుకే ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వా లేదు దానికి తోడు వృద్ధాప్యంతో వచ్చిన ఆరోగ్య సమస్యలతో పాటు కీళ్లనొప్పులు బాధిస్తుండటంతో కూలీకి వెళ్లలేకపోతోంది. ప్రభుత్వం ఇచ్చే వృధ్యాప్య పింఛన్.. రేషన్ సరుకులతోనే కాలం వెళ్లదీస్తోంది.
ఈమె పరిస్థితి తెలుసుకున్న కలకోట కార్యదర్శి ఇళ్లు కట్టుకోవడానికి సిమెంట్ స్తంభాలు ఇచ్చారు. కానీ ఇంటిపై రేకులు వేసుకోవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంటుంది. ప్రభుత్వం స్పందించి.. నాగరత్నానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని.. కలకోట గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు..