నెల్లూరులో ఓట్ల సర్వే కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు, సర్వేలు, ఐటీ గ్రిడ్ డేటా అంశాలు కాక పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధానంగా సర్వేల తొలగింపుపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన సానుభూతి పరుల ఓట్లు, దొంగ ఓట్లు టీడీపీ చేరిపిస్తోందంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు యువకులు చేసిన సర్వే కలకలం సృష్టించింది.
జిల్లాలో ముగ్గురు యువకులు ఎంట్రీ ఇచ్చారు. వేదాయపాలం పీఎస్ పరిధిలోని నేతాజీ నగర్‌లో స్థానికులను పలు వివరాలు అడిగారు. ఏపీ సర్కార్ చేపడుతున్న పథకాలపై ఆరా తీశారు. పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు. ఈ విషయం వైసీపీ పార్టీ లీడర్స్‌కి తెలిసింది. వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రంగప్రవేశం చేసి యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓట్ల తొలగింపు వివాదంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. యువకులు బెంగళూరుకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూపుకు చెందిన వారుగా తేలింది. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.