శ్రీశైలం డ్యాంలో కుక్కల జలకాలాటలు చూడండీ

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 07:57 AM IST
శ్రీశైలం డ్యాంలో కుక్కల జలకాలాటలు చూడండీ

Updated On : September 13, 2019 / 7:57 AM IST

నీటికి చూస్తే చక్కగా జలకాడాలని అనుకుంటాం. నీటిని చూస్తే మనుషులకే కాదు జంతువులకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంకు కూడా భారీగా నీరు చేరుకుంది.

దీంతో డ్యాంలో నీటిని చూసిన నీటి కుక్కలు కూడా జలకాలాడాలనుకున్నాయోమో ..చక్కగా డ్యాంలోకి దిగి జలకాలాడాయి. శ్రీశైలం డ్యాంలో  కుక్కలు చక్కగా ఈదటం చూసి సందర్భకులు కేరింతలు కొట్టారు.  డ్యాం నీటిలో కుక్కలు సందడి చూసి పర్యటకులు సంతోషపడ్డారు.  డ్యాం 4,6 గేట్ల మధ్య నాలుగు నీటి కుక్కలు మునుగుతూ..తేలుతూ..నీటికి ఎదురీదుతూ సందర్శకులను అలరించాయి. వాటి సందడిని తమ సెల్ ఫోన్లతో షూట్ చేశారు. ఫోటోలు..వీడియోలు తీశారు. కుక్కల ఆటలను ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేలా ఉందని సందర్శలుకు సంతోషం వ్యక్తంచేశారు.