కుటుంబ సభ్యులు కోర్టుకెక్కినా.. కొడుకు తర్వాత కొడుకు వైఎస్ జగన్ పట్టించుకోట్లేదు

  • Published By: vamsi ,Published On : January 29, 2020 / 09:10 PM IST
కుటుంబ సభ్యులు కోర్టుకెక్కినా.. కొడుకు తర్వాత కొడుకు వైఎస్ జగన్ పట్టించుకోట్లేదు

Updated On : January 29, 2020 / 9:10 PM IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కుట్రదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న.  జగన్ పాత్ర ఉంది కాబట్టే  కేసును సీబీఐకి ఇవ్వకుండా నత్తనడకన నడిచేట్టు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందని, కేసును సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదని ప్రశ్నించారు. వివేకా హత్యలో సీఎం జగన్ పాత్ర కూడా ఉందనేది ప్రజలకు అర్ధమవుతోందని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేసును పట్టించుకోవట్లేదని వివేకా కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు.

జగన్ సొంత చెల్లెలు రక్షణ కావాలని పోలీసులను కోరుకుందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఆనాడు పరిటాల రవీంద్ర హత్య కేసులో జగన్ పాత్ర ఉందని ఆరోపణ వచ్చినప్పుడు  వైఎస్ వెంటనే సీబీఐకి ఇచ్చారని, మరి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయి హత్యపై సీబీఐ అడిగి ఇప్పుడు ఎందుకు  పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

మీ తండ్రికి ఉన్న చిత్తశుద్ధి మీకు లేదా? అని నిలదీశారు. వైఎస్ వివేకానంద హత్య కేసును ఆయన కుటుంబ సభ్యులు వదిలివేసినా టీడీపీ మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తుంది అని అన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతల పేర్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు బుద్ధ వెంకన్న. సొంతబాబాయి హత్యకేసుని సీబీఐకి అప్పగించడానికి జగన్‌ ఎందుకు తాత్సారం చేస్తున్నాడని, వైఎస్‌ వివేకా కుమార్తె, భార్య హైకోర్టుకు వెళ్లినా దానిపై ముఖ్యమంత్రి స్పందించట్లేదని అన్నారు.

వివేకానంద రెడ్డి హత్య గావించబడిన తీరుచూసి రాష్ట్రమంతా చలించినా కొడుకు తర్వాతి కొడుకైన జగన్‌ ఎందుకు పట్టించుకోట్లేదని ప్రశ్నించారు.