ఏపీకి వెనుకబడిన దేశం ఆదర్శమా?

ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగా మూడు రాజధానులు అని సీఎం జగన్ ప్రకటించటమేంటంటూ ఓ మహిళ మండిపడ్డారు.
సౌతాఫ్రికాకు మూడు రాజధానులు విషయంలో నెల్సన్ మండేలా కూడా తీవ్రంగా వ్యతిరేకించారని ఓ మహిళ గుర్తు చేశారు. నెల్సన్ మండేలా వంటి మేధావే వ్యతిరేకించారని ఆ విషయం సీఎం జగన్ కు తెలీదా? అంటూ ప్రశ్నించారు. ఈనాటికి సౌతాఫ్రికాలో మూడు రాజధానుల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ..అటువంటి దేశాన్ని ఆదర్శంగా తీసుకోవటమేంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తున్న బ్రిటన్ వంటి ఐరోపాదేశాలను..అమెరికాలను ఆదర్శంగా తీసుకోవచ్చుకదా అని సూచించారు.
ప్రజలతో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయి ఇప్పుడు ప్రజల భవిష్యత్తునే అంధాకారం చేస్తున్న సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.