సీఈసీని కలవనున్న వైసీపీ నేతలు

విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్రిల్ 15 సాయంత్ర సీఈసీని కలవనున్నారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన సందర్భంగా ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీని కల్పించాలని వైసీపీ నేతలు సీఈసీకి విజ్నప్తి చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారులను ఒత్తిడికి గురి చేస్తోందని ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఏపీ ఎన్నికలు పూర్తయిన తరువాత నెలకొన్న పరిస్థితులను ఈసీకి వివరించనున్నారు. ఎన్నికల కమిషన్ పై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని..ఎలక్షన్ అయిన తరువాత టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇటువంటి పలు అంశాలను ఎన్నికల సంఘాన్ని కలిసి వివరించనున్నారు.