జగన్ భారీ కానుక : ఉచితంగా వైద్య సేవలు

ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 12:56 PM IST
జగన్ భారీ కానుక : ఉచితంగా వైద్య సేవలు

Updated On : April 5, 2019 / 12:56 PM IST

ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.

గుంటూరు : ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏపీలో పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఒకరికి మించి మరొకరు వాగ్దానాలు చేస్తున్నారు. ఫ్రీ..ఫ్రీ.. అంటూ ఊదరగొట్టేస్తున్నారు. వైసీపీ చీఫ్ జగన్.. మరో అడుగు ముందుకేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ కానుక ప్రకటించారు. ఆ కుటుంబాలకు లబ్ది చేకూరేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించారు. యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించారు.
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ

నెలకు రూ.40వేల లోపు జీతం ఉన్నవారికి (ఏడాదికి రూ.5లక్షలలోపు ఆదాయం) కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. వారందరికి యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. గుంటూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ ఈ ప్రకటన చేశారు. నిరుపేదల నుంచి ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల నియంత్రణకు రెగులేటరీ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. 
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్