లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 08:32 AM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు

Updated On : March 30, 2019 / 8:32 AM IST

లక్ష్మీపార్వతి కోణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాను ఏపీలో విడుదల చేయకుండా హైకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏపీలో విడుదల కాకపోవడంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్.. చంద్రబాబుపై విమర్శలు సందించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన జగన్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.
Read Also : Social Media లో YCP : ట్రెండింగ్‌లో రావాలి జగన్..సాంగ్

తనకు వ్యతిరేకంగా తెరకెక్కిన లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో ఎవ్వరూ చూడకూడదని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. ఆ సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించారని తెలిపారు. ఏపీ ప్రజలు తనకు అనుకూలమైన మహానాయకుడు మాత్రమే చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారని మండిపడ్డారు.

వాళ్ల సినిమానే చూడాలి. ఆయన సినిమా మహానాయకుడు అ టు అది మాత్రమే చూడాలి. టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన పత్రికలు, టీవీలను మాత్రమే ప్రజలు చూడాలని భావిస్తుందని అన్నారు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే వాళ్ల స్కూళ్లు, వాళ్ల ఆస్పత్రులకే వెళ్లి ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు చెల్లించవలసి వస్తుందని అన్నారు.
Read Also : లోకేష్ పప్పు.. పప్పు : జయంతికి.. వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల