వైసీపీలో చేరనున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డి

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 10:59 AM IST
వైసీపీలో చేరనున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డి

Updated On : March 10, 2020 / 10:59 AM IST

టీడీపీకి వరుస షాకులు తప్పటంలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ నియోజకవర్గం నుంచి పులివెందుల నుంచి టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బాటలోనే  కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీకి కీలక నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలో చేరనున్నట్లుగా సమాచారం. వైసీపీ అధిష్టానం నుంచి రామసుబ్బారెడ్డి పిలుపు వచ్చింది. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వస్తున్నాయి.

రామసుబ్బారెడ్డితో పాటు దేవగుడి దేవగుడి సోదరులైన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ శినాథ్ రెడ్డిలకు కూడా వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.  దేవగుడి సోదరుల్లో ఒకరైన శివనాథరెడ్డి శాసనమండలిలో వైసీపీకి అండగా నిలబడ్డారు. దీంతో వీరిద్దరికీ వైసీపీ నుంచి పిలుపులు వచ్చాయి. దీంతో వారు కూడా వైసీపీలో చేరనున్నారు. కాగా రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వస్తే ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నామని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.   (టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి బాలకృష్ణ స్నేహితుడు)

అధికారం ఏపార్టీకి ఉంటే దాంట్లోకి చేరిపోవటం నేతలకు అలవాటే.రాజకీయాల్లో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. అధికారం కోసం నేతలు ఎటువంటి స్థాయికైనా దిగిపోతు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు. ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేకుండా చేస్తున్నారు.