నాగార్జునపై దాడితో నాకు సంబంధం లేదు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున రెడ్డి గురించి డీజీపీకి లేఖ రాయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. నాగార్జున రెడ్డిపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు నాగార్జున అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదని.. టీడీపీ ఏజెంట్, కరణం బలరాం అనుచరుడు అని ఆమంచి ఆరోపించారు. తన గురించి తన కుటుంబం గురించి నాగార్జున ఫేస్‌బుక్‌లో తప్పుడు రాతలు రాశారని చెప్పారు. ఐఏఎస్ అధికారులను సైతం అసభ్యంగా దూషించాడని అన్నారు. చంద్రబాబుని చచ్చిన పాముతో పోల్చారు ఆమంచి.
నాగార్జున గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశాడని, టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడు అని ఆమంచి వివరించారు. నాగార్జునపై మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సీఎం జగన్ నీతివంతమైన పాలన చూసి చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆమంచి అన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని సీఎం జగన్‌కు అంటగడుతున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు టీడీపీలో కీలకంగా ఉన్న సమయంలో వంగవీటి రంగా హత్య జరిగింది, ఆ కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండా చంద్రబాబు కాపాడారని ఆమంచి ఆరోపించారు. చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జునపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసింది చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరులు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమంచి అక్రమాలు, దౌర్జన్యాలు వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్ట్ నాగార్జునపై దాడి జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదానికి దారితీసింది.