Viral Video: రెయిన్ కోట్తో వర్షంలో పరుగులు పెట్టిన కుక్క.. తెగ ముచ్చపడుతోన్న నెటిజెన్లు
ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే 16 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి. రెండు వేలకు మందికి పైగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంత మంది తమ కుక్కలకు ఇలాంటి కోట్స్ కొన్నామని చెప్తుండగా, కొందరు ఇలాంటివి కుక్కలకు ఉపయోగించాలని సూచిస్తున్నారు.

Dog Runs Around Building Wearing Yellow Raincoat
Viral Video: వర్షం బయటికి వెళ్లాలంటే వెంటనే గొడుగు తీసుకుంటాం. ఇంకాస్త కంఫర్టబుల్గా వెళ్లాలంటే రెయిన్ కోట్ లాంటివి ఉపయోగిస్తుంటాం. మరి ఇలాంటివి కేవలం మనుషులకేనా? జంతువులు కూడా వర్షంలో తడుస్తాయి. వాటికి కూడా వర్షంలో తడవడం ఇబ్బందే. మరి వాటికి కూడా రెయిన్ కోట్ లాంటివి ఉంటే.. భలేగా ఉంటుంది కదా.
ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. రెయిన్ కోట్ వేసుకున్న ఒక కుక్క.. ఇల్లంతా తిరుగుతూ సందడి చేసింది. దాని యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. అది చూస్తూ నెటిజెన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘డాగ్ స్నోఫి ఇన్స్టాగ్రామ్’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ‘మారుమరిమాయో నుంచి అందమైన చిన్న రెయిన్ ట్రోట్ పొందింది. మీ కుక్క వర్షాన్ని ఇష్టపడుతుందా?’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
కాగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే 16 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి. రెండు వేలకు మందికి పైగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంత మంది తమ కుక్కలకు ఇలాంటి కోట్స్ కొన్నామని చెప్తుండగా, కొందరు ఇలాంటివి కుక్కలకు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
View this post on Instagram