Viral Video : అమేజింగ్ టాలెంట్.. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్.. వీడియో వైరల్

Teahcer Dance : టీచర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ గా డ్యాన్స్ చేశారని ప్రశంసలు అందుతున్నాయి.

Viral Video : అమేజింగ్ టాలెంట్.. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్.. వీడియో వైరల్

Teacher Dance(Photo : Google)

Updated On : May 18, 2023 / 11:55 PM IST

Teahcer Dance : ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. వారి టాలెంట్ చూశాక వావ్ అనాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. ఇదిగో.. ఈ ప్రభుత్వ పాఠశాల టీచర్ ఆ కోవకే వస్తారు. సర్కారీ బడిలో టీచర్ గా పని చేసే ఆమెలో మరో టాలెంట్ దాగుంది. అదే డ్యాన్స్. తాజాగా ఆమె తన ప్రతిభను బయటపెట్టింది. డ్యాన్స్ ఇరగదీసింది. అందరితో శభాష్ అని ప్రశంసలు అందుకుంది. మహిళా టీచర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ గా డ్యాన్స్ చేశారని ప్రశంసలు అందుతున్నాయి.

Also Read..Viral Video : బాబోయ్.. ప్రతీకారం తీర్చుకున్న గాడిద.. తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుడికి ఆ గాడిద ఎలా బుద్ధి చెప్పిందో చూడండి

మధ్యప్రదేశ్ శివపురి సమీపంలోని కరైరాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ట్రైనింగ్ జరుగుతోంది. దీనికి టీచర్లు హాజరయ్యారు. అక్కడ కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఇందులో భాగంగా ఓ టీచర్ డ్యాన్స్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ సినిమా పాటకు తనదైన డ్యాన్స్ చేసి అలరించింది.

Also Read..Viral Video : మనిషేనా? చెల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించి వీడియో తీసిన సోదరుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

డ్యాన్స్ అంటే.. అలా ఇలా కాదు.. పాటకు అనుగుణంగా చేసింది. స్టెప్పులతో ఇరగదీసింది. ఆమె డ్యాన్స్ చూసి ఇతర టీచర్లు ఆశ్చర్యపోయారు. బాగా డ్యాన్స్ చేస్తోందని ప్రశంసించారు. చప్పట్లు కొడుతూ ఆమెని మరింత ప్రోత్సహించారు. దీంతో ఆ టీచర్ మరింత ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా ఆ టీచర్ డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. సూపర్ గా చేశారని మెచ్చుకున్నారు.