వీధి కుక్కలకు తన ఆహారాన్ని తినిపిస్తున్న బిచ్చగాడు… వీడియో వైరల్

  • Published By: Chandu 10tv ,Published On : July 16, 2020 / 03:37 PM IST
వీధి కుక్కలకు తన ఆహారాన్ని తినిపిస్తున్న బిచ్చగాడు… వీడియో వైరల్

Updated On : July 16, 2020 / 7:00 PM IST

మనిషి, మనిషికి మధ్య ఉన్న బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నా ఈ రోజుల్లో ఒక వృద్ధుడైన బిచ్చగాడు తన ఆహారాన్ని వీధి కుక్కలకు పంచాడు. దీని బట్టి ఇంకా మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉందని చెప్పవచ్చు. మనిషిలో ఇంకా మంచితనం బతికి ఉందనేందుకు ఈ సంఘటన మంచి నిదర్శనం అవుతుంది. అయితే ఆ వ్యక్తి ఏమి ధనవంతుడు కాదు, అయినప్పటికి తనకున్న దానిలో సాయం చేసి మంచి దయా గుణాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ సుశాంత్ నందా ఓ సందేశంతో తన ట్విట్టర్ ద్వారా వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో వృద్ధుడైన ఓ బిచ్చగాడు ఆహారాన్ని తింటుండగా.. వీధి కుక్కలు అతని చుట్టూ వచ్చి చేరుతాయి. దీంతో ఆ వృద్ధుడు తను తింటున్నా ఆహారాన్ని రెండు ప్లేట్లలోకి వేరు చేసి ఆ కుక్కలకు తినిపించటం కనిపిస్తుంది. ‘సంపదలో పేదవాడు. మనసున్న వ్యక్తిలో ధనవంతుడు’ అనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 4 వేలకు పైగా వీక్షించారు. వెయ్యికి పైగా లైకులు వచ్చాయి. వృద్ధుడు దయతో వాటికి తినిపించిన తీరు, అతని దయ, మంచితనాన్నికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.