ఇప్పటినుంచి మాస్క్ కూడా సేఫ్ కాదు.. చెవుల ద్వారా కూడా కరోనా

ప్రస్తుతం COVID-19 మహమ్మారి ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని మనకి తెలుసు. కానీ ఒక అధ్యయనంలో పరిశోధకులు మరో కొత్త విషయాన్ని నిర్ధారించారు. అదేంటంటే.. చెవుల ద్వారా కూడా వ్యాపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. చెవి లోపల వెనుక భాగంలో మెత్తని ఎముకతో కూడిన ప్రాంతాన్ని మస్టాయిడ్ అంటారు. అక్కడ కరోనా రోగుల చెవుల్లోని మస్టాయిడ్ ప్రాంతంలో వైరస్ ను గుర్తించారు. ఈ పరిశోధనను Johns Hopkins Medicine బృందం నిర్వహించింది.
కరోనాతో మరణించిన రోగుల చెవుల్లోని మస్టాయిడ్ ఏరియాలో కరోనా ఉండటంతో వైద్యులు షాక్ అయ్యారు. అయితే కరోనా తీవ్రత పెరిగినపుడు రోగి శరీరం నుంచి చెవుల్లోకి ప్రవేశిస్తుందా.. లేదంటే బయటనుంచి చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయని వైద్యులు చెప్తున్నారు.
చెవి మధ్యలో ఉండే మూడు చిన్న ఎముకలు మనకు ధ్వని వినిపించేలా చేస్తాయి. ఆ ప్రాంతంలోనే కరోనా వైరస్ ఉందని తేలింది. దీంతో ఇప్పటి నుంచి ఆసుపత్రులను సందర్శించే రోగులలో లేదా శస్త్రచికిత్స విధానాలలో వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని బృందం హెచ్చరించింది.