వీడియో: ఏనుగుల ట్రాఫిక్ సెన్స్.

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 06:36 AM IST
వీడియో: ఏనుగుల ట్రాఫిక్ సెన్స్.

Updated On : February 3, 2020 / 6:36 AM IST

ఒక ఏనుగుల గుంపు ఏవిధంగా రోడ్డును దాటాయో తెలిపే ఒక వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కశ్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనుషులే కాదు, జంతువులు కూడా రోడ్డును దాట్టేప్పుడు ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతాయో ఈ వీడియోలో చూడవచ్చు.

అసలు వివరాల్లోకి వెళ్లితే… ఒక అడవిలో దట్టమైన పొగ మంచు గుండా ఏనుగుల గుంపు ఒక వరుస పద్దతిలో రోడ్డు దాటుతూ కనిపించాయి. రోడ్డు దాటానికి ముందు ఒక సెకన్ ఆగి అవైపుగా ఏమైనా వాహనాలు వస్తున్నాయి లేదా అని గమనిస్తూ రోడ్డు దాటినట్లు కనిపిస్తుంది. రోడ్డు దాట్టేప్పుడు ఎంత జాగ్రత్తగా దాటాలో ఈ వీడియోలో చూడవచ్చు.

మార్నింగ్ వాక్ లో ఒక చిన్న ఏనుగుల కటుంబం అనే క్యాప్షన్ తో వీడియోని జనవరి 31, 2020 న  ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 1.2 లక్షల మంది పైగా చూశారు. 7 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. 

అందులో ఒక మగ ఏనుగు.. ఒక ఆడ ఏనుగు.. ఒక పిల్ల ఏనుగు ఉన్నట్లుగా అర్థం అవుతుంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు.. ఏనుగు కుటుంబమే.. కానీ చిన్న కటుంబం అని కామెంట్లు చేస్తున్నారు.