బికినీలో మంటలు పుట్టిస్తున్న హార్థిక్ పాండ్యా ప్రేయసి

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కాబోయే భార్య, సినీ నటి నటాషా సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన హాట్ హాట్ అందాలతో మంటలు పుట్టిస్తోంది. లాక్ డౌన్ వేళ తన బికినీ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది నటాషా. సముద్ర తీరాన బ్లాక్ బికినీలో కెమెరాకు ఫోజిచ్చిన ఈ సెర్బియా బ్యూటీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ హాట్ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
నాకు కావాల్సింది విటమిన్ సీ:
ఇన్‌స్టాగ్రామ్ లోఈ ఫొటోను షేర్ చేసిన నటాషా.. ‘నాకు కావాల్సింది మంచి విటమన్ సీ (విటమిన్ సముద్రం) డోస్’ అని క్యాప్షన్ పెట్టింది. సెర్బియా మోడల్, సినీ నటి అయిన నటాషా బిగ్ బాస్ 8తో తెరంగ్రేటం చేసింది. తన అందచందాలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నటాషా.. తాను గతంలో బీచ్‌లో దిగిన బికినీ చిత్రాన్ని నెటిజన్లతో ఇప్పుడు పంచుకుంది. నాకు కావాల్సింది మంచి విటమిన్ సీ అంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెళ్లి కాకుండానే గర్భం:
కొత్త ఏడాది సందర్బంగా నిశ్చితార్ధం చేసుకున్నామని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన హార్దిక్-నటాషా జోడీ.. లాక్‌డౌన్‌లో త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నామని వెల్లడించారు. అయితే ఈ జంట దండలు మార్చుకున్న ఫొటో ఒకటి వైరల్ కాగా.. వీరి పెళ్లిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారని అందరూ భావిస్తున్నారు. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది’ అని హార్దిక్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
ఇటీవల తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌పై పొగడ్తల వర్షం కురిపించిన హార్దిక్… ఆమెతో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ నటాషా అందాన్ని కొనియాడాడు. ‘హే నటాషా.. నీ ముఖంలో ఈ గ్లో ఎక్కడిదమ్మా’ అని చిలిపిగా ప్రశ్నించాడు. దీనికి నటాషా కూడా చాలా క్యూట్‌గా సమాధానమిచ్చింది. తన సౌందర్యం క్రెడిట్ అంతా హార్దిక్‌దేనని తెలుపుతూ.. ‘హార్దిక్.. నీ ప్రేమ వాత్సల్యమే నా ముఖంలోని గ్లోకు కారణం’ అని అంతే చిలిపిగా బదులిచ్చింది.