ప్లాస్టిక్‌ బాటిల్‌ మింగిన పాము.. వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 05:59 AM IST
ప్లాస్టిక్‌ బాటిల్‌ మింగిన పాము.. వీడియో వైరల్

Updated On : January 10, 2020 / 5:59 AM IST

పాము ప్లాస్టిక్‌ బాటిల్‌ ను మింగడం ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే. ఓ గ్రామంలోకి ప్రవేశించిన పాము ప్లాస్టిక్‌ బాటిల్‌ ను మింగేసి తీవ్ర అవస్థలు పడింది. దీంతో అక్కడి గ్రామికులు వెంటనే స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం వారు వచ్చి పాము కడుపులో ఉన్న బాటిల్‌ ను బయటకు కక్కించారు.

ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కశ్వాన్‌ తన ట్విట్టర్‌ లో పోస్టు చేశారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్‌ ను పడేయకూడదు. మనవల్ల మూగజీవుల ప్రాణాలకు నష్టం జరుగుతోంది. ఒక్క చిన్న ప్లాస్టిక్‌ ముక్క అటవీ జంతువులకు, ఇతర జాతులకు ఎంత ప్రమాదం కలిగిస్తాయో చూడండి అని ఆయన క్యాప్షన్‌ ఇచ్చారు.

ప్లాస్టిక్ బ్యాగ్‌లు, బాటిల్లు, సోడా సీసాలు, స్ట్రాలు, ప్లేట్లు, కప్పులు, ఫుడ్ ప్యాకేట్లు, కంటెయినర్లు ఇలా మన జీవతంలో ప్రతీ వస్తువు ప్లాస్టికే వాడుతున్నాం. మన జీవితంలో ప్లాస్టిక్‌ విడదీయరాని బంధంగా మారిపోయింది. ప్లాస్టిక్‌ పై నిషేధం విధించిన గానీ వాడటం మానట్లేదు. ఈ ప్లాస్టిక్‌ వల్ల జరిగే నష్టాలు తెలిసినా కూడా ప్లాస్టిక్‌ కు దూరంగా ఉండడం లేదు. ఇప్పటికైనా ప్లాస్టిక్‌ కు దూరంగా ఉందాం. మనం బతుకుదాం.. మూగజీవాలను బతుకనిద్దాం.