పిల్లాడి చేతి వేళ్ల నుంచి పుల్లలు : డాక్టర్లకు కూడా అంతుచిక్కని వింత వ్యాధి

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 02:35 AM IST
పిల్లాడి చేతి వేళ్ల నుంచి పుల్లలు : డాక్టర్లకు కూడా అంతుచిక్కని వింత వ్యాధి

Updated On : February 9, 2020 / 2:35 AM IST

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా లేకున్నా ఇది నిజం. పిల్లాడి వేళ్ల నుంచి పుల్లలు వస్తున్నాయి. మొదట్లో దీన్ని బాబు తల్లిదండ్రులు పెద్దగా గమనించ లేదు. కానీ పుల్లలు వేళ్ల నుంచి ఎక్కువగా రావడం మొదలైంది.

దీంతో బాబు తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత షాక్ తిన్నారు. ఆపై తమ బిడ్డకు ఏమైందోనని కంగారు పడ్డారు. వెంటనే కళ్యాణదుర్గంలోని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు. తమ బాబుని కాపాడాలని వేడుకున్నారు. వేలికి అయిన గాయానికి చికిత్స చేసి పంపించారు డాక్టర్. అయితే పుల్ల ఎలా వస్తుంది అనేదానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. 

వైద్యులకు కూడా ఈ వ్యాధి ఏంటి అనేది అంతు చిక్కడం లేదు. దీంతో తమ బిడ్డకు ఏమైందోనని శ్రీసాయి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాంతక వ్యాధి ఏమో అని కంగారు పడుతున్నారు. తమ బిడ్డను ఆ దేవుడే కాపాడాలని ప్రార్థించారు. పిల్లాడి చేతి వేళ్ల నుంచి పుల్లలు లాంటివి రావడం విచిత్రంగా మారింది. అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు.

 

1