Bengaluru : ఇది గులాబ్ జామా? లేక ఐస్ క్యూబా? కనిపెట్టండి
కొత్త రకమైన డెజర్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామా? ఐస్ క్యూబా? నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో మీరు కనిపెట్టండి.

Bengaluru
Bengaluru : సోషల్ మీడియాలో అనేక విచిత్రమైన వంటకాల వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. రకరకాల ఆహార పదార్ధాలను జోడించి కొందరు వంటలు చేస్తుంటారు. ఇప్పుడో సరికొత్త డెజర్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. దీనిని చూస్తుంటే గులాబ్ జామా? లేక ఐస్ క్యూబా? అని ఖచ్చితంగా డౌట్ వస్తుంది. మీరు కనిపెట్టగలరా?
Viral Video: డిఫరెంట్ గులాబ్ జామున్.. నోట్లో వేసుకుంటే మత్తులో తూగాల్సిందే!
ఓ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (tastethisbangalore) వింత గులాబ్ జామూన్ వీడియో పోస్ట్ చేశారు. ‘ట్రాన్స్పరెంట్ గులాబ్ జామూన్’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్లేట్ పైన తిరుగుతున్నది ట్రాన్స్పరెంట్ బాల్ లాగ కనిపిస్తుంది. దానిపైన ఒక జామూన్ ఉంచారు. ప్లేట్‌లో కొన్ని మసాలాలు చల్లారు.
Tomato ice cream : ‘టొమాటో ఐస్ క్రీం’ కొత్త ఫుడ్ కాంబినేషన్ .. ‘రిప్ టొమాటో’ అంటున్న నెటిజన్లు
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఇది ఫ్యాన్సీ ఐస్ క్యూబ్ తప్ప మరొకటి కాదని కొందరు.. ఇది కేవలం బంతి అని ప్రజలు దీనిని చూసి మోసపోతున్నారంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు. నిజానికి ఈ పోస్టులో ‘ట్రాన్స్పరెంట్ గులాబ్ జామూన్’ అని అయితే రాసారు. అదేంటో నిజంగా తెలియాలంటే పోస్ట్ పెట్టిన వాళ్లు మరోసారి క్లారిటీ ఇవ్వాలేమో?
View this post on Instagram