ఒడిశాలోకి ప్రవేశించిన ఫొని తుఫాన్

ఫొని తుఫాన్ ఏపీ తీర ప్రాంతం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. మరికాసేపట్లో పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తీరంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈదురు గాలులకు వృక్షాలు విరిగి పడ్డాయి. స్తంభాలు కూలాయి. పలు గ్రామాల్లో ప్రజలు అంధకారంలో గడిపారు. తూర్పు కోస్తాలో 107 రైళ్లను రద్దు చేశారు.