ముంచుతోంది : తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం

ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను పొగమంచు వెంటాడుతోంది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 01:55 AM IST
ముంచుతోంది : తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం

ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను పొగమంచు వెంటాడుతోంది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు.

ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను పొగమంచు వెంటాడుతోంది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ఉదయం నుంచి మరుసటిరోజు ఉదయం వరకు దట్టంగా అలముకుంటోంది. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, డ్రైవింగ్ చేసే వాళ్లు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే వాళ్లు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇన్నాళ్లూ ఏజెన్సీ ప్రాంతాల్లోనే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో మైదాన ప్రాంతాల్లోనూ దాని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నాలుగు రోజుల నుంచి తూర్పు గాలులు వీయడం మొదలయ్యాయి. దీంతో ఉపరితలానికి కిలోమీటరు ఎత్తులో ఉష్ణోగ్రతలు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయి. దీనివల్ల నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ఉపరితలంపైనే ఉండిపోయి పొగమంచు ఏర్పడుతోంది. అదే సమయంలో బలమైన గాలులు కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని వాతావరణశాఖ శాఖ నిపుణులు చెబుతున్నారు.

రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. జనవరి 17వ తేదీ వరకు రాత్రి వేళలతోపాటు ఉదయం 10 గంటల వరకు నగరంలో పొగమంచు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.