సీమలో కుండపోత : ఆ 3 జిల్లాల్లో భారీ వర్షాలు.. నీటిలో మహానంది

రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 07:50 AM IST
సీమలో కుండపోత : ఆ 3 జిల్లాల్లో భారీ వర్షాలు.. నీటిలో మహానంది

Updated On : September 17, 2019 / 7:50 AM IST

రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు

రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అటు కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నంద్యాల, మహానంది, గోస్పాడు మండలాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి‌. తమడపల్లె గ్రామం దగ్గర రాళ్లవాగు, గాజుల పల్లె సమీపంలోని పాలెరు వాగు పొంగిపొర్లడంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రముఖ ఆలయం మహానంది జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం చుట్టూ నీరు ప్రవహిస్తోంది. మొదటి రెండో ప్రాకారంలోకి నీరు ప్రవేశించింది. వరదలతో మహానంది ఆలయానికి దర్శనాలు రద్దు చేశారు. మహానంది పరిధిలో స్కూల్స్ కి సెలవులు ఇచ్చారు. మహానంది అగ్రికల్చరల్ కాలేజ్ దగ్గర పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహానంది పరిధిలోని ఈశ్వర్ నగర్, అబ్బిపురం, పుట్టుపల్లె గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ నీరు ముంచెత్తింది. కుందూనది ఉధృతంగా ప్రవహించడంతో నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ‌ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

కడప జిల్లాలోనూ వానలు పడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి పలు మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో వర్షం నీరు రావడంతో రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవడియం మండలంలో కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నెమళ్లదిన్నె బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగంతో పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు  నిలిచిపోయాయి.

అనంతపురం జిల్లాలోనూ అదే పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. పుట్టపర్తిలో వేణుగోపాల స్వామి ఆలయం, సత్యమ్మ దేవాలయాలు నీట మునిగాయి. బాలికల హాస్టల్ లోకి వరద నీరు ప్రవేశించింది.  దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.