Hot Summer: ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు.. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది
Hot Summer: ఏపీలో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. తీవ్రమైన వడగాలులు వీయనున్నాయి. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో ఎండల ఉధృతి, వడగాల్పులపై అలర్ట్ చేసింది. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందంది. 49 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళవారం మరింత తీవ్రత ఉండే ఛాన్స్ ఉంది. 53 మండలాల్లో తీవ్ర వడగాలులు, 57 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో వడగాల్పులు.. కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరుగుదల ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉంటుందని చెప్పింది. పోలవరం, అనకాపల్లి, ఏలూరు ప్రాంతాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తాకిడి పెరుగుతోంది. కడప జిల్లాలో 43.8°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 42°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా తీవ్ర వేడి ఉంది.
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఎండ తగలకుండా తలకు టోపీ పెట్టుకోవాలని, కాటన్ దుస్తులే ధరించాలంది. సన్ గ్లాసెస్ వాడాలని సూచన చేసింది. గుండె, షుగర్, బీపీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలంది. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలంది. డీహైడ్రేషన్ నివారించేందుకు నీరు ఎక్కువగా తాగాలంది.
Also Read: మళ్లీ చమురు సంక్షోభం? ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో పెనుమార్పులు? కలకలం రేపుతున్న ట్రంప్ పోస్ట్
