ఈ చలికాలం చచ్చేంత డేంజర్..! వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..

నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని అంటోంది.

ఈ చలికాలం చచ్చేంత డేంజర్..! వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..

Updated On : November 16, 2024 / 5:46 PM IST

Dangerous Winter : ఇంకా కంప్లీట్ గా వింటర్ లోకి ఎంటర్ అవ్వలేదు. కానీ, చలి పులిలా వెంటాడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? నిజమే.. ఈసారి దేశంలో చలికాలం మామూలుగా ఉండదు. లానినా కండీషన్స్ అలా ఉన్నాయి మరి. పైగా, వచ్చే చలికాలం చచ్చేంత డేంజర్ అంటోంది భారత వాతావరణ శాఖ. దీంతో అందరిలో చలిపోయి గిలి మొదలైంది.

శీతాకాలం స్టార్ట్ అయ్యింది. ప్రారంభంలోనే ప్రజలను గజగజ వణికిస్తోంది చలి. ఇక రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుంది. ఈసారి చలి పులి పంజా మామూలుగా విసరదు. దెబ్బకంతా గజగజ వణికిపోవాల్సిందే అంటోంది భారత వాతావరణ శాఖ. లా నినా ఎఫెక్ట్ తో ఈ శీతాకాలంలో రికార్డ్ స్థాయిలో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని అంటోంది. ఇప్పటికే ఉత్తర భారతంలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు.. రాత్రి వేళ 14-19 డిగ్రీలుగా ఉన్నాయి. త్వరలోనే ఇవి జీరో, మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయని హెచ్చరిస్తోంది భారత వాతావరణ శాఖ.

ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతోంది. రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీతో సహా నార్త్ ఇండియాలోని చాలా ప్రాంతాలను ఇప్పటికే పొగ మంచు కప్పేసింది. మధ్య, వాయువ్య భారతం, దక్షిణాదిన కూడా చలి పంజా గట్టిగానే విసరనుంది. ఈ నెలాఖరుకి లా నినా ఎఫెక్ట్ తో చలి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

రానున్న రోజుల్లో మంచు కురిసే తీవ్రత, చలి.. సాయంత్రం నుంచే స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటలు దాటినా.. పొగమంచు వదలదు. మిట్ట మధ్యాహ్నం అయితే కానీ, సూర్యుడి జాడ కనపడదు. ఇలాంటి వాతావరణం చాలా ప్రమాదకరం. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నగరాల్లో అయితే ట్రాఫిక్, పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం బీభత్సంగా పెరుగుతుంది.

గాలిలో దుమ్ము, ధూళికణాలు, కాలుష్య కారకాలు అలాగే తేలియాడుతూ ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రమైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో విజిబులిటీ బాగా తగ్గిపోతోంది. 10 మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి. వాహన ప్రమాదాలు కూడా ఈసారి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది.

ఇంతకీ ఏ లా నినా ఎఫెక్ట్ ఏంటి? చలికి, లా నినా ఎఫెక్ట్ కు లింక్ ఏంటి? ఫసిఫిక్ మహా సముద్రానికి, హిందూ మహా సముద్రానికి ఉన్న వాతావరణ సంబంధం ఏంటి? ఎందుకు టెంపరేచర్స్ అంతలా తగ్గిపోనున్నాయి? దేశ వ్యాప్తంగా చలి తీవ్రత ఎందుకని బాగా పెరుగుతోంది? ఐఎండీ ముందస్తుగా ఎందుకు ఇంతలా హెచ్చరిస్తోంది.

పూర్తి  వివరాలు..

Also Read : యూపీలోని చిన్నారుల మృతి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు.. నర్సు నిర్లక్ష్యమే కారణమా?