Weather Update: మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

రాగల 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.

Weather Update: మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Telangana Rains

Weather Update – Telangana: రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఉత్తర జార్ఖండ్ (Jharkhand), దాని పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ – ఉత్తర అంతర్గత ఒడిశా వద్ద ఉన్న అల్పపీడనం ఇవాళ బలహీన పడింది.

అయితే దీని అనుబంధ ఆవర్తనం దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపు వాలి ఉంది. రాగల 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గోవా, ఒడిశా, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ 8 రాష్ట్రాల్లో స్థానికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

Stress and Multiple Sclerosis : యువకులలో వైకల్యానికి ఒత్తిడి ప్రధాన కారణమా ? ఒత్తిడి నాడీ వ్యవస్ధలో మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుందా ?