జగన్ కత్తి కేసు : విశాఖకు ఎన్ఐఏ ఆఫీసర్స్

  • Edited By: madhu , January 5, 2019 / 04:58 AM IST
జగన్ కత్తి కేసు : విశాఖకు ఎన్ఐఏ ఆఫీసర్స్

విశాఖపట్టణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కత్తి కేసులో ఎన్ఐఏకి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని విశాఖ పోలీసులను కోరితే…ఇవ్వం…ప్రభుత్వ అనుమతితోనే ఇస్తామని తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ డీజీపిని కలువాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించుకున్నారు. కేసుకు సంబంధించిన విషయంలో సహకరించాలని వారు కోరనున్నట్లు తెలుస్తోంది. 
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వీవీఐపీ లాంజ్‌లో 2018, అక్టోబరు 25వ తేదీన జగన్‌పై దాడి జరిగింది. ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ – ఏపీ టీడీపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ కేసును ఎన్.ఐ.ఏకు అప్పగించాలని వైఎస్ఆర్ నేతలు గతంలోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జనవరి 04 శుక్రవారం హైకోర్టు ఎన్ఐఏకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఎవరు ? ఇతని చరిత్ర ఏంటీ ? దాడికి ఎందుకు పాల్పడ్డాడు ? ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే దానిపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. అయితే..ఇక్కడ ప్రభుత్వం ఎన్ఐఏకి సహకరిస్తుందా ? వివరాలు సమర్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి.