Viral Video: నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల చిలిపి చేష్టలు!

కోతులంటేనే వాటి చేష్టలు.. బిహేవియర్ గురించి అందరికీ తెలిసిందే. ఉన్న చోట ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ.. చెట్ల మీద నుండి మరో చెట్టు మీదకి దూకుతూ ఏవో వాటి తిప్పలు అవి పడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అవి చేసే కొన్ని చేష్టలు చూసేందుకు తమాషాగా అనిపించగా.. అప్పుడప్పుడు కొత్తగా కూడా అనిపిస్తుంటాయి.

Viral Video: నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల చిలిపి చేష్టలు!

Viral Video

Viral Video: కోతులంటేనే వాటి చేష్టలు.. బిహేవియర్ గురించి అందరికీ తెలిసిందే. ఉన్న చోట ఉండకుండా అటూ ఇటూ గెంతుతూ.. చెట్ల మీద నుండి మరో చెట్టు మీదకి దూకుతూ ఏవో వాటి తిప్పలు అవి పడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అవి చేసే కొన్ని చేష్టలు చూసేందుకు తమాషాగా అనిపించగా.. అప్పుడప్పుడు కొత్తగా కూడా అనిపిస్తుంటాయి. అలా ఓ కోతి పిల్ల సమయస్ఫూర్తితో ఆలోచించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్నాయి.

ఓ కోతి పిల్ల.. పెద్ద కోతుల మందతో కలిసి గోడ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తనతో పాటు ఉన్న ఓ పెద్ద కోతి సునాయాసంగా గోడ ఎక్కి కూర్చుంటే.. అది చూసి తానూ ఎక్కాలని కోతిపిల్ల తహతహలాడింది. కానీ చిన్నగా ఉండడంతో పెద్ద గోడ ఎక్కేందుకు తెగ ఇబ్బంది పడింది. అప్పటికీ చాలా ప్రయత్నాలే చేసినా తన వల్ల కాలేదు. అప్పుడే ఆ కోతి పిల్లకు ఓ ఐడియా వచ్చింది. ముందుగా గోడెక్కిన ఆ పెద్ద కోతి తోక వేలాడుతుండడం కనిపించింది. అంతే కోతిపిల్ల దానిని పట్టుకుని చకచకా గోడను ఎక్కేసింది.

ఓ వ్యక్తి ఈ ఇస్మార్ట్ కోతిపిల్ల చేష్టలను వీడియో తీసి ట్విట్టర్​లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. గోడ ఎక్కేందుకు ఈ కోతి పిల్ల చేసిన చిలిపి చేష్టలు నెటిజన్ల మనసు దోచేస్తుండగా ఆ వానర ప్రయత్నంపై కామెంట్ల జోరు సాగుతోంది.