Rains In Andhra Pradesh : ఒకవైపు నైరుతి..మరో వైపు అల్పపీడనం…ఏపిలో వానలే..వానలు…

 నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains In Andhra Pradesh : ఒకవైపు నైరుతి..మరో వైపు అల్పపీడనం…ఏపిలో వానలే..వానలు…

Rains In Ap Due To Monsoon Low Pressure

Rains In Andhra Pradesh : నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో ఎపి వ్యాప్తంగా విస్తరించనున్నాయి. వాటి ప్రభావంతో రేపటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

మరోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం ఒడిశా తీరం వైపు ప్రయాణిస్తూ క్రమంగా బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది.

దీనికారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో ఈ నెల 11 నుంచి కోస్తా తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 11 నుంచి 15వ తేదీ వరకూ మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.