Normal Monsoon: 2021లో సాధారణ రుతుపవనాలు.. హెల్తీ వెదర్ అంటున్న స్కైమెట్

భారతదేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని స్కైమెట్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరుసగా మూడవ సంవత్సరం కూడా రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Normal Monsoon: 2021లో సాధారణ రుతుపవనాలు.. హెల్తీ వెదర్ అంటున్న స్కైమెట్

Skymet Forecasts Normal Monsoon In 2021

normal monsoon in 2021 : భారతదేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని స్కైమెట్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరుసగా మూడవ సంవత్సరం కూడా రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 2021 ఏడాదిలో భారతదేశంలో రుతుపవనాలు 103శాతం ఉండే అవకాశం ఉందని Skymet వెదర్ పేర్కొంది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA)లో వందశాతానికి పైగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

LPA సగటు ఆల్ ఇండియా రుతుపవనాల వర్షపాతం 88 సెం.మీగా ఉంటుందని అంచనా వేసింది. 2020లో ముగిసిన రుతుపవనాలు ప్రత్యేకమైనవి. ఇండియాలో 2019 వర్షాకాలంతో పోలిస్తే.. ఈ ఏడాదిలో వరుసగా మూడోసారి సాధారణ వర్షపాతం ఉండొచ్చునని తెలిపింది. వర్షపాతం సాధారణం కంటే 5శాతం కంటే ఎక్కువ (105శాతం) ఉంటుందని పేర్కొంది. రాబోయే నెలల్లో వర్షపాతం కొంచెం బలహీనపడుతుందని భావిస్తోంది. వర్షాకాలంలో జూన్-సెప్టెంబర్ నెలలో వర్షపాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వాతావరణ-అధ్యక్షుడు జి.పి.శర్మ అన్నారు.

చాలా ఏళ్లలో భారతదేశంపై రుతుపవనాల వర్షపాతం బలహీనపడింది. రుతుపవనాలు కూడా సకాలం వస్తాయని భావిస్తున్నారు. సెప్టెంబరు (రుతుపవనాలు తగ్గుముఖం పట్టే నెల) కూడా సాధారణం కంటే 10శాతం ఎక్కువ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ఈ నెల చివరిలో వాతావరణ సూచనను ప్రకటించనుంది. భారత్‌లో రికార్డు స్థాయిలో 10శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేసింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర భారతదేశంలోని మైదానాలు ఈ సీజన్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చునని భావిస్తోంది. జూలై, ఆగస్టు ప్రధాన రుతుపవనాలలో కర్ణాటక తదిదర ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది.