Face Book లో మహిళ ఫోన్ నెంబర్..Call Girl అంటూ Post..ఫోన్లే ఫోన్లు

  • Published By: madhu ,Published On : September 21, 2020 / 08:49 AM IST
Face Book లో మహిళ ఫోన్ నెంబర్..Call Girl అంటూ Post..ఫోన్లే ఫోన్లు

Call Girl  : మహిళపై ఆగ్రహంతో ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. Call Girl అంటూ పోస్టు చేయడంతో..ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. విసిగివేసారిన ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..




గుజరాత్ రాష్ట్రంలో Sabarkantha జిల్లాలోని Talod ప్రాంతంలో Pappu Mehta నివాసం ఉండేవాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుని..matrimonial website లో ప్రోఫెల్ ని పోస్టు చేసినట్లు చెప్పాడు. అహ్మదాబాద్ లో నివాసం ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడడంతో ఇరువురు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు.

అయితే..ఇక్కడ మెహతా మరో మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ..అతనికి ఫోన్ చేసి ఆగ్రహంగా మాట్లాడింది. దీనిని మెహత అవమానంగా భావించాడు. వెంటనే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా ఓపెన్ చేసి మహిళ ఫోన్ నెంబర్ ను అందులో పోస్టు చేసి Call Girl అంటూ పేర్కొన్నాడు.




సంబంధిత మహిళకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు రావడం ప్రారంభమైంది. విసుగు చెందిన మహిళ కుటుంబం సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. టెక్నికల్ గా నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.మహిళపై ఆగ్రహంతో ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. Call Girl అంటూ పోస్టు చేయడంతో..ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి.