Family Man 2: వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘ఫ్యామిలీ మేన్’..!
వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫిల్మ్‌ఫేర్స్ గెలుచుకుని మోస్ట్ వ్యూడ్ సిరీస్‌గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని మరింత పగడ్బంధీగా ప్లాన్ చేసిన రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 కోసం తెలుగు స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిని తీసుకున్నారు.
Family Man 2: వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫిల్మ్‌ఫేర్స్ గెలుచుకుని మోస్ట్ వ్యూడ్ సిరీస్‌గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని మరింత పగడ్బంధీగా ప్లాన్ చేసిన రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 కోసం తెలుగు స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిని తీసుకున్నారు. ఈ సిరీస్ తోనే సామ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.
మొదట ట్రైలర్ తోనే ఇంట్రెస్టింగ్ పెంచేసిన ఈ సిరీస్ కోసం ఇండియన్ ఓటిటి వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత రాజీ అనే శ్రీలంక తమిళియన్‌గా సరికొత్త క్యారెక్టర్లో కనిపించి ఇరగదీసింది. అప్పటి వరకు ఉన్న సమంతా వేరు.. ఫ్యామిలీ మేన్ సమంతా వేరు. తాను తీసుకున్న డేరింగ్ స్టెప్ కు ఫలితం దక్కింది. ఒక్కసారిగా వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యేలా చేసింది.
ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ మోస్ట్ పాపులర్ షోస్ జాబితాతో చోటు దక్కించుకొనేలా చేసింది. ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో మోస్ట్ పాపులర్ షోస్ ఇన్ ది వరల్డ్ జాబితాలో ఫ్యామిలీ మేన్ 2 నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు హాలీవుడ్ కి చెందిన లోకీ, స్వీట్ టూత్, మేర్ ఈస్ట్ టౌన్ మొదటి స్థానాలు దక్కించుకుంటే.. ఫ్యామిలీ మాన్ 2 నాలుగో స్థానాన్ని దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. రాజ్ అండ్ డీకే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేకి తోడు మనోజ్, ప్రియమణి, సామ్ నటన ఈ సిరీస్ స్థాయిని పెంచేలా చేశాయి.