BuchhiBabu Sana : సుకుమార్ గారికి చెప్పే స్థాయి నాకు లేదు..
తాజాగా సుకుమార్ తో స్టోరీ డిస్కషన్ లో బుచ్చిబాబు కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా బుచ్చిబాబు పుష్ప 2 కోసం సుకుమార్ కి హెల్ప్ చేస్తున్నాడేమో......
BuchhiBabu Sana : ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు బుచ్చిబాబు సాన. సుకుమార్ శిష్యుడిగా పరిచయం అయి మొదటి సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. అప్పటినుంచి బాగా ఫేమస్ అయ్యాడు బుచ్చిబాబు. ప్రతి ఈవెంట్ లోను కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కి కథ చెప్పి సినిమా ఓకే చేయించుకున్నాడు. అయితే అది ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు అనౌన్స్ చేశారు. ఒకవేళ బుచ్చిబాబు సినిమా చేస్తే ఆ రెండిటి తర్వాతే చేయాలి. మరి అప్పటి వరకు బుచ్చిబాబు ఏం చేస్తాడు అంటే ఎవ్వరిదగ్గర సమాధానం లేదు.
కొత్త ప్రాజెక్ట్స్ ఏవి కూడా చేస్తున్నట్టు ప్రకటించలేదు బుచ్చిబాబు. తాజాగా సుకుమార్ తో స్టోరీ డిస్కషన్ లో బుచ్చిబాబు కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా బుచ్చిబాబు పుష్ప 2 కోసం సుకుమార్ కి హెల్ప్ చేస్తున్నాడేమో, ఖాళీగా ఉండకుండా పుష్ప 2కి వర్క్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు. తాజాగా బుచ్చిబాబు ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. సుకుమార్ తో స్టోరీ డిస్కషన్ లో ఉన్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ”ఈ ఫోటో నేను తరువాత చేయబోయే నా సినిమా కథ డిస్కషన్ సందర్భంలోది. మా గురువు గారు సుకుమార్ సర్ నా కోసం, నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సర్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు” అని పోస్ట్ చేశాడు.
Theaters : ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ.. అయినా థియేటర్ కి రాని జనం..
దీంతో బుచ్చిబాబు ఏదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? లేక ఎన్టీఆర్ కథకే సుకుమార్ మెరుగులు దిద్దుతున్నారా అని ఆలోచిస్తున్నారు నెటిజన్లు. మరి బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.
ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X
— BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022