Hyderabad T20 Match: 4 వేల కార్లు, 5 వేల బైకుల పార్కింగుకు స్థలం కేటాయింపు.. ట్రాఫిక్ ఆంక్షలు

ఉప్పల్​ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగు ఏర్పాట్లు చేశారు. స్టేడియం సమీపంలోని ఏ, సీ గేట్ల మార్గాల వద్ద అభిమానులు తమ వ్యక్తిగత వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. పాసులు ఉన్నవారు పాత ఎమ్మార్వో ఆఫీసు వద్ద వాహనాలు పెట్టాల్సి ఉంటుంది. అంతేగాక, పలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీవీఐపీలు, వీఐపీలు గేటు నంబరు 1 నుంచి స్టేడియంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

Hyderabad T20 Match: 4 వేల కార్లు, 5 వేల బైకుల పార్కింగుకు స్థలం కేటాయింపు.. ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad T20 Match

Hyderabad T20 Match: ఉప్పల్​ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగు ఏర్పాట్లు చేశారు. స్టేడియం సమీపంలోని ఏ, సీ గేట్ల మార్గాల వద్ద అభిమానులు తమ వ్యక్తిగత వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. పాసులు ఉన్నవారు పాత ఎమ్మార్వో ఆఫీసు వద్ద వాహనాలు పెట్టాల్సి ఉంటుంది.

అంతేగాక, పలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీవీఐపీలు, వీఐపీలు గేటు నంబరు 1 నుంచి స్టేడియంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు కూడా ఇక్కడి నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చాలా కాలం తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంది.

రేపు ఆదివారం కావడంతో సాధారణంగా ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మ్యాచ్ జరుగుతుండడంతో అంతగా ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండబోవని అధికారులు భావిస్తున్నారు. రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి.

Hyderabad T20 Match: రేపటి మ్యాచ్ కోసం ఉప్పల్‌ స్టేడియానికి ఇలా వెళ్లి, వస్తే ఎంతో సౌకర్యవంతం