Hyderabad T20 Match: రేపటి మ్యాచ్ కోసం ఉప్పల్‌ స్టేడియానికి ఇలా వెళ్లి, వస్తే ఎంతో సౌకర్యవంతం

వ్యక్తిగత వాహనాలపై కాకుండా మెట్రో రైలు, బస్సుల వంటి ప్రజా రవాణాను వినియోగించి స్టేడియానికి రావాలని, దీంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు ప్రత్యేక మెట్రో రైళ్లు నడుస్తాయి. ఈ మేరకు మెట్రో ఇప్పటికే ప్రకటన చేసింది. మరోవైపు, మ్యాచ్ దృష్ట్యా రేపు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. స్టేడియం నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి ప్రజా రవాణాను వినియోగించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది.

Hyderabad T20 Match: రేపటి మ్యాచ్ కోసం ఉప్పల్‌ స్టేడియానికి ఇలా వెళ్లి, వస్తే ఎంతో సౌకర్యవంతం

Hyderabad T20 Match

Hyderabad T20 Match: ఉప్పల్‌ స్టేడియంలో రేపు జరగనున్న భారత్‌, ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా కాలం తర్వాత ఆ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడం, రేపు ఆదివారం కావడం, మూడు మ్యాచుల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమ ఉజ్జీలుగా ఉండడంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తితో ప్రేక్షకులు తరలిరానున్నారు. రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒక్కసారిగా వేలాది మంది స్టేడియానికి తరలి వస్తుండడంతో ట్రాఫిక్, పార్కింగ్ వంటి పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

దీంతో వ్యక్తిగత వాహనాలపై కాకుండా మెట్రో రైలు, బస్సుల వంటి ప్రజా రవాణాను వినియోగించి స్టేడియానికి రావాలని, దీంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు ప్రత్యేక మెట్రో రైళ్లు నడుస్తాయి. ఈ మేరకు మెట్రో ఇప్పటికే ప్రకటన చేసింది.

అమీర్‌పేట్, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి కనెక్టింగ్‌ రైళ్లు ఉంటాయి. ఆ మెట్ర రైళ్లను ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఎక్కే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లోని ఇతర మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు నిష్క్రమించే అవకాశం ఉంటుంది. ఒకేసారి మెట్రో స్టేషన్లలోకి అభిమానులు దూసుకువచ్చే అవకాశం ఉంది. దీంతో టికెట్లు కొనే సమయంలో భారీ క్యూ ఉండొచ్చు.

సాయంత్రం స్టేడియానికి వచ్చే ముందుగానే రిటర్న్‌ టిక్కెట్లను కొనుగోలు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు చెప్పారు. రేపు సెలవు దినం కావడంతో మెట్రో స్మార్ట్ కార్డు కూడా పనిచేస్తుంది. మరోవైపు, మ్యాచ్ దృష్ట్యా రేపు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. స్టేడియం నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి ప్రజా రవాణాను వినియోగించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది.

Roger Federer Video: ఆటకు వీడ్కోలు పలికిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. భావోద్వేగంతో కన్నీరు