కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలి : డీజీపీ

కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 09:52 PM IST
కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలి : డీజీపీ

కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.

కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు. ఈ మేరకు బుధవారం డీజీపీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా సోకకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని, ఇదే అత్యుత్తమ విధానమన్నారు. అవసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరే బయటికి రావాలని సూచించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నందున అందరూ దీన్ని పాటించాలన్నారు. 

డయల్ 100కు మూడు రోజుల్లోనే 6.4 లక్షల ఫోన్లు వచ్చాయని డీజీపీ పేర్కొన్నారు. దీంతో డయల్ 100 సిబ్బందికి ఎంత పని ఒత్తిడి ఉందో అర్థం అవుతుందన్నారు. ఆ సిబ్బందికి వ్యక్తిత్త వికాస నిపుణులతో శిక్షణ ఇప్పించామని తెలిపారు. దాంతో వారు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు సహకరిస్తుందని చెప్పారు. 

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 127కు చేరాయి. బుధవారం (మార్చి1, 2020) ఒక్కరోజే 30 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది. హైదరాబాద్ లో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడి సరికాదని ఆసుపత్రి సూపరిండెంట్‌ శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను వైద్యారోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లామని శ్రవణ్‌ తెలిపారు. 

కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టిన తమపై దాడికి దిగడం ఏమిటంటూ గాంధీ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు ప్రశ్నించారు. మృతుని బంధువులు దాడికి నిరసనగా జూడాలు ఆందోళను దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ జూడాలకు సర్దిచెప్పి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తామని సీపీ హామీ ఇవ్వడంతో వైద్యులు ఆందోళన విరమించారు. అయితే దాడి చేసిన వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో.. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు.

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేంద్ర పిలుపు మేరకు ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇళ్ల నుంచి జనాలు బయటికి రాకుండా పోలీసులను మోహరించారు. అత్యవసరాలైతే తప్ప బయటికి రావొద్దని హచ్చరిస్తున్నారు. అది కూడా ఇంటి నుంచి ఒక్కరికే వెళ్లాలని చెప్పారు.

Also Read | కరోనా : బయటికి రావొద్దని యముడు చెప్పినా వినరా?