Virupaksha: విరూపాక్ష కోసం వస్తున్న వీరమల్లు.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. తేజ్ యాక్సిడెంట్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో తేజ్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Virupaksha: విరూపాక్ష కోసం వస్తున్న వీరమల్లు.. ఫ్యాన్స్‌కు పండగే!

Pawan Kalyan To Grace Sai Dharam Tej Virupaksha Teaser Launch

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. తేజ్ యాక్సిడెంట్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో తేజ్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

virupaksha title launch event : విరూపాక్ష టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

విరూపాక్ష సినిమా టీజర్‌ను మార్చి 1న లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఇక ఈ సినిమా టీజర్ లాంచ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. ఈ టీజర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పవన్-తేజ్ కాంబినేషన్‌లో ప్రముఖ తమిళ దర్శకుడు కమ్ యాక్టర్ సముధ్రఖని ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే, తేజ్ నెక్ట్స్ మూవీని ప్రమోట్ చేసేందుకు పవన్ వెంటనే ఓకే చేప్పినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

Virupaksha : అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాయి ధరమ్ ‘విరూపాక్ష’ ట్రైలర్ అదుర్స్..

ఒకవేళ నిజంగానే తేజ్ సినిమా టీజర్ లాంచ్‌కు పవన్ చీఫ్ గెస్టుగా వస్తే, అది ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. చాలా రోజు తరువాత తేజ్ సినిమాకు పవన్ గెస్టుగా వస్తుండటంతో ఈ సినిమా టీజర్ లాంచ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఓ మిస్టికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.