Delhi : డీజే సౌండ్ తగ్గించమని కోరిన గర్భిణిపై కాల్పులు జరిపిన యువకుడు .. గర్భస్రావం కావటంతో పరిస్థితి విషమం

డీజే సౌండ్ తగ్గించమన్న గర్భిణిపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Delhi : డీజే సౌండ్ తగ్గించమని కోరిన గర్భిణిపై కాల్పులు జరిపిన యువకుడు .. గర్భస్రావం కావటంతో పరిస్థితి విషమం

Delhi

Delhi : డీజే సౌండ్ తో హోరెత్తిస్తూ ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తూ..ప్రశ్నించిన గర్భిణిపై కాల్పులు జరిపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఎదుటివారికి ఇబ్బంది కలుగచేయటమే కాకుండా డీజేపీ సౌండ్ తగ్గించమని రిక్వెస్ట్ చేసిన గర్భిణిపై ఓ వ్యక్తి విచక్షణ పరిచి తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయిన ఘటన ఢిల్లీలోని సిర్సాపూర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ నగరంలోని సిర్సాపూర్ ప్రాంతంలో రంజూ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటుంది. ఆమె గర్భిణి. రంజూవారి పొరుగింట్లో ఆదివారం (మార్చి2,2023)ఓ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ లో వారు డీజే ఏర్పాటు చేసుకున్నారు. డీజేని బిగ్గరగా సౌండ్ పెట్టారు. హరిష్ అనే వ్యక్తి పెద్ద శబ్దంతో డీజే పెట్టుకోవటమేకాకుండా డ్యాన్సులతో నానా హంగామా చేయటం ప్రారంభించాడు. డీజే సౌండ్లు భరించలేక రంజూ బాల్కనీలోకి వెళ్లి రమేశ్ ను పిలిచి సౌండ్ తగ్గించమని కోరింది. దానికి రమేశ్ నా ఇష్టం తగ్గించేది లేదని చెప్పాడు. అంత బిగ్గరగా సౌండ్ వినపడుతుంటే నాకు ఇబ్బందిగా ఉంది సౌండ్ తగ్గించమని చెప్పింది.

గర్భిణిలు ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ డీజే సౌండ్ లతో హోరెత్తిస్తూ ఇబ్బందికి గురి కావటంతో ఆమె అదే విషయాన్ని చెప్పింది. కానీ రమేశ్ వినకపోవటంతో మరోసారి చెప్పింది. దీంతో మమ్మల్ని ఎంజాయ్ చేయనియ్యవా ఏంటీ అంటూ ఆగ్రహంతో అరిచాడు. అక్కడితో ఊరుకోకుండా తుపాకి తెచ్చి ఆమెపై కాల్పులు జరిపాడు.

దీంతో ఆమె మెడలోకి తూటా దూసుకుపోయి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడింది. తుపాకీ శబ్ధం కావటంతో స్థానికులు బయటకు వచ్చి చూసారు. రంజూ తీవ్రంగా గాయపడటం గురించిన స్థానికులు వెంటనే షాలిమార్ బాగ్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేశారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరీష్, అతడి స్నేహితుడిపై హత్యాయత్నంతో పాటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బాధితురాలి మెడకు తీవ్రంగా గాయమైందని తీవ్ర రక్తస్రావం అయ్యిందని ఆ పరిస్థితిలో ఆమె వాంగ్ములం ఇచ్చే పరిస్థితిలో కూడా లేదని డిప్యూటి కమిషనర్ రవికుమార్ సింగ్ తెలిపారు.నిందితులను అరెస్ట్ చేశామని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.