Karnataka Politics: ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే మరో సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం

ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర్గమైన వరుణ పట్టణాన్ని తాలూకా కేంద్రంగా మార్చాలని స్థానికులు డిమాండ్‌ చేశారు

Karnataka Politics: ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే మరో సంచలన ప్రకటన చేసిన కర్ణాటక సీఎం

Congress Poll Promise: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం ఉదయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ప్రారంభానికి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 10 కిలోల ఉచిత బియ్యం పథకం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. శనివారం మైసూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం శనివారం మీడియాతో మాట్లాడుతూ జూలై ప్రారంభం నుంచి బీపీఎల్‌ కార్డుదారులకు 10 కిలోల బియ్యం పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

Janasena Vs Police : జనసేన వర్సెస్ పోలీస్.. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సెక్షన్ 30 యాక్ట్ అమలు

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ ఉచిత బియ్యం పథకం అప్లై అవుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇక గృహలక్ష్మి గ్యారెంటీకి మరో ఐదు రోజుల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితిలోను వాయిదాలు ఉండవని స్పష్టం చేశారు. దరఖాస్తు రూపొందించే ప్రక్రియ సాగుతోందని ఆయన తెలిపారు.

Joe Biden: 5 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బాంబ్ పేల్చిన బాంబ్‭షెల్

ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర్గమైన వరుణ పట్టణాన్ని తాలూకా కేంద్రంగా మార్చాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ప్రజల డిమాండ్‌ను బట్టి వరుణను తాలూకా కేంద్రం చేస్తామన్నారు.