Bengaluru : 30 బీపీ ట్యాబ్లెట్లు మింగించి .. తల్లిని చంపిన మహిళ కేసులో సంచలన విషయాలు

తల్లిని చంపి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది ఓ మహిళ. తల్లికి అధిక మోతాదులో బీపీ ట్యాబ్లెట్లు మింగించి చంపానని తెలిపింది.

Bengaluru : 30 బీపీ ట్యాబ్లెట్లు మింగించి .. తల్లిని చంపిన మహిళ కేసులో సంచలన విషయాలు

Bengaluru

Bengaluru Crime : బెంగళూరులో కన్నతల్లిని కూతురే అత్యంత దారుణంగా చంపిన కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సోమవారం (జూన్ 12) మధ్యాహ్నం 1గంట సమయంలో తల్లిని చంపి మతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి దానితోనే పోలీస్ స్టేషన్ కు వచ్చి తాను హత్య చేశానని చెప్పింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. కన్నతల్లినే హత్య కేసిన 39 ఏళ్ల మహిళ ఏకంగా మృతదేహాన్ని తీసుకొచ్చి మరీ పోలీసులకు తానే హత్య చేశానని చెప్పటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. కావాలంటే చూడండీ ఈ సూట్ కేస్ లోనే డెడ్ బాడీ ఉందని చెప్పింది. దీంతో పోలీసులు ట్రాలీ సూట్ కేసును పరిశీలించగా దాంట్లో వద్ధురాలి మతదేహం ఉంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆమెను విచారించగా సంచలన విషయాలు బయటపెట్టింది.

అస్సాంలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేసేది సోనాలి సేన్ అనే 39 ఏళ్ల మహిళ. ఆమె ఉద్యోగం మానేసి బెంగళూరు వచ్చేసింది. ఆమెకు తల్లి ఉంది. పేరు బావాపాల్. వయస్సు 71 ఏళ్లు. కోడిచిక్కనహళ్లిలోని ఎన్ఎస్ఆర్ గ్రీన్ అపార్ట్ మెంట్ లో ఐదేళ్లుగా నివసిస్తున్నారు. ఆమె భర్త చనిపోవటంతో కూతురు సోనాలి ఇంటికి వచ్చేసింది. అలా సోనాలి సేన్, తల్లి భర్త,అత్త,కుమారుడితో కలిసి ఉంటున్నారు. సోనాలి భర్త జిగాని ఇండ్రస్ట్రియల్ ఏరియాలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఉమ్మడి సంసారం కావటంతో తరచు సోనాలికి తల్లికి గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో గత సోమవారం సోనాలి ఆమె తల్లి గొడవపడ్డారు. దీంతో బివాపాల్ తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. నేను జీవించి ఉన్నంత వరకు శాంతి లేదు నన్ను చంపేయ్ అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తు అరిచింది.

Vikarabad : స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచి, గొంతుకోసి నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్, డీజీపీకి కీలక ఆదేశం

దీంతో సోనాలి మరింతగా కోపం ముంచుకొచ్చింది. సోమవారం ఉదయం 7.15 గంటలకు సోనాలి భర్త పనికి వెళ్లిపోయాడు. ఆ తరువాత సోనాలి తల్లికి బలవంతంగా దాదాపు 30 వరకు బీపీ ట్యాబ్లెట్లు మింగించింది. దాంతో ఆమెకు ఉదయం 11.30 సమయంలో పక్షవాతానికి గురి అయ్యారు. ఆ తరువాత నొప్పితో మెలికలు తిరిగిపోతుండగా ఓ దుప్పట్టా పట్టుకుని తల్లి గొంతు నులిమి చంపేసింది సోనాలి. ఆ తరువాత తల్లి మృతదేహాన్ని ఓ ట్రాలీ సూట్ కేస్ లో కుక్కింది. దాన్ని పట్టుకుని ఓ ఆటో మాట్లాడి సూట్ కేసు దాంట్లో పెట్టి డైరెక్టుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. నేను నా తల్లిని చంపేశాను..డెడ్ బాడీ ఈ సూట్ కేసులో ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

సూట్ కేసును పరిశీలించిన సబ్ ఇన్ స్పెక్టర్ సంజీవ్ గురప్ప కేసు నమోదు చేసుకుని సోనాలిపై హత్య కేసు నమోదు చేశారు. ఆ తరువాత విచారణ జరుపగా తన తల్లికి బీపీ ట్లాబ్లెట్లు మింగించి దుప్పట్టాతో గొంతు నులిమి హత్య చేశానని చెప్పింది.