Mudragada Letter : పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ, ఏమన్నారంటే..

నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదు. యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదు.

Mudragada Letter : పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ, ఏమన్నారంటే..

pawan kalyan..mudragada

mudragada Letter for pawan kalyan : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏమిటీ? అనేది ఆసక్తికంగా మారింది. మరి ఆ అంశాలేమిటంటే..నిజాన్ని నిర్భయంగా చెప్పాలని ఈ లేఖ రాస్తున్నాను అంటూ ముద్రగడ పేర్కొన్నారు. నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని.. యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదు అంటూ స్పష్టంచేశారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని..నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరు ఎందుకు అందించలేదు ? అని ప్రశ్నించారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర.. కాకినాడ జిల్లాలో ఏడో రోజు

కాపు ఉద్యమంతో నేను ఓటమికి దగ్గర అయ్యాననీ..వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయం..?అంటూ ప్రశ్నించారు. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటి వరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో గుండ్లు గీయించారో సెలవు ఇవ్వాలి అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుంది అని మాట్లాడడం తప్పు అన్నారు. కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పన్నారు.

కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించండి సత్తా చూపడానికి ముందుకు రండి..175 స్థానాలలో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండి అనాలి తప్ప.. కలిసి పోటీ చేసినప్పుడు అనడం హాస్యాస్యద్పంగా ఉంది అంటూ మద్రగడ లేఖలో పేర్కొన్నారు.

Pawan Kalyan : మీ నమ్మకాన్ని సరైన వ్యక్తుల దగ్గర పెట్టడం లేదు- మత్స్యకారులతో పవన్ కల్యాణ్