Kishan Reddy : కాంగ్రెస్​కు బీఆర్​ఎస్​కు తేడా లేదు.. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్​ఎస్​ వాళ్లు కాంగ్రెస్​ హయాంలో మంత్రులుగా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం రావాలంటే, బీఆర్​ఎస్​ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు.

Kishan Reddy : కాంగ్రెస్​కు బీఆర్​ఎస్​కు తేడా లేదు.. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

Door To Door BJP Program : కాంగ్రెస్​కు బీఆర్​ఎస్​కు తేడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. బీఆర్​ఎస్​లో చేరారని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరు అవుతుందని తెలిపారు.

హైదరాబాద్ అంబర్​పేట్​ నియోజకవర్గంలోని గోల్నాకలో మహాజన్​ సంపర్క్​ యాత్ర.. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. గతంలో ప్రజలు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్​ఎస్​ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్​లోకి పోయారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందని స్పష్టం చేశారు.

Etala Rajender – Komatireddy : ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి దూరంగా.. ఈటల, కోమటిరెడ్డితోపాటు పలువురు సీనియర్లు

ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటుందని.. భూములు, బిల్డింగ్​లు కొనాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అవినీతిమయం అయిందని, కల్వకుంట్ల కుటుంబంపాలైందని ఆరోపించారు.

మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే, రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్​ఎస్​ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. అవినీతి, నియంతృత్వ, అక్రమాలు చేసే పార్టీని, అధికారం దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్​కు ఓటేస్తామంటే.. కాంగ్రెస్​కు, బీఆర్​ఎస్​కు తేడా లేదన్నారు.

CM KCR : కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్​లోకి పోయారని విమర్శించారు. అందుకే బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. బీఆర్​ఎస్​తో బీజేపీ ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని.. భవిష్యత్​లో పెట్టుకోబోదని చెప్పారు. కానీ, కాంగ్రెస్​ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్​ఎస్​ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు.

రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్​ఎస్​ వాళ్లు కాంగ్రెస్​ హయాంలో మంత్రులుగా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం రావాలంటే, బీఆర్​ఎస్​ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు. వందల, వేల కోట్ల రూపాయాలు అక్రమంగా సంపాదించి.. ఆ డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి అధికార పార్టీ, కేసీఆర్​ ఉన్నారని విమర్శించారు.